ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్

హెచ్ఎండిఏ పరిధిలోని భూములు, ప్లాట్ల విక్రయానికి మరోసారి ఈ-వేలం నిర్వహించనున్నారు. కోకాపేట నియోపాలిస్‌లో ఎకరాకు కనీస ధర రూ.120 కోట్లు, మూసాపేటలో రూ.99 కోట్లుగా నిర్ణయించారు. కోకాపేటలో గతంలో సింగిల్ బిడ్ రావడంతో రద్దయిన 4.59 ఎకరాల భూమిని మళ్లీ వేలానికి ఉంచుతున్నారు.

మూసాపేటలో 3.15 ఎకరాలను విక్రయించనున్నారు.బాచుపల్లి, కాప్రా, రాయదుర్గ్ నౌఖల్సా, అమీన్‌పూర్ తదితర ప్రాంతాల్లోనూ భూములు, ప్లాట్లను వేలం వేయనున్నారు. ఇన్ముల్‌నర్వలో 45, బాచుపల్లిలో 50, హకీంపేటలో 8 ప్లాట్లు విక్రయానికి అందుబాటులో ఉన్నాయి.

నవంబర్ 12 నుంచి 27 వరకు ఈ-వేలం నిర్వహించనున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారు వెబ్‌సైట్‌లో రూ.1,180 రుసుముతో నమోదు చేసుకుని, ప్రతి ప్లాట్‌కు నిర్ణయించిన ఈఎండీ చెల్లించి వేలంలో పాల్గొనవచ్చు. వేలంలో విజేతలు నిబంధనల ప్రకారం ఏడు రోజుల్లో 25 శాతం, మిగిలిన మొత్తాన్ని 60 రోజుల్లో చెల్లించాలి.

Shankar Pothuganti

By Shankar Pothuganti

Publisher & Editor