Health

హైదరాబాద్ చుట్టూ RRR.. రియల్ ఎస్టేట్‌కు కొత్త రెక్కలు
హైదరాబాద్ చుట్టూ RRR.. రియల్ ఎస్టేట్‌కు కొత్త రెక్కలు

ఉత్తర, దక్షిణ భాగాలుగా 362 కి.మీ. రింగ్ రోడ్.. 90 గ్రామాల్లో 4,962 ఎకరాల భూసేకరణకు కసరత్తు

రైతులకు ప్రాంతాల వారీగా పరిహారం.. శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక, నివాస అభివృద్ధికి భారీ అవకాశాలు

ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్

హైదరాబాద్ మహానగర భవిష్యత్తు అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఔటర్ రింగ్ రోడ్ (ORR)కు వెలుపల మరో భారీ రవాణా వలయాన్ని నిర్మించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఉత్తర, దక్షిణ భాగాలుగా రూపుదిద్దుకుంటోంది. సుమారు 362 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు కొత్త పారిశ్రామిక, వాణిజ్య, నివాస ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగమం కానుంది.

RRR ఉత్తర భాగం సంగారెడ్డి నుంచి నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు సుమారు 161.5 కిలోమీటర్ల మేర ప్రతిపాదించారు. ఈ భాగానికి సంబంధించిన భూసేకరణ పూర్తయినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్మాణ పనుల ప్రారంభానికి అవసరమైన టెండర్లు, కేంద్ర అనుమతుల ప్రక్రియపై దృష్టి సారించింది. దక్షిణ RRR చౌటుప్పల్ నుంచి అమంగళ్, షాద్‌నగర్, చేవెళ్ల, వికారాబాద్ మీదుగా సంగారెడ్డి వరకు సుమారు 201 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ మార్గానికి సంబంధించి 90 గ్రామాల్లో సుమారు 4,962 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని నవంబర్‌లో నిర్వహించిన సమీక్షలో అధికారులు వెల్లడించారు. భూసేకరణ, అలైన్‌మెంట్, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.

RRR ఉత్తర భాగంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భూసేకరణ పరిహారం నిర్ణయించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ ప్రాంతంలో హైవే పక్కన ఉన్న భూములకు ఎకరాకు సుమారు రూ.1.27 కోట్ల వరకు పరిహారం నిర్ణయించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఇతర ప్రాంతాల్లో భూముల స్థానం, మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ లావాదేవీల ఆధారంగా పరిహారం మారుతోంది. ఈ మొత్తాలు అన్ని గ్రామాలకు ఒకే విధంగా వర్తించవు.

రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త అవకాశాలు

RRR నిర్మాణం పూర్తయితే సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, అమంగళ్, షాద్‌నగర్, చేవెళ్ల, శంకర్‌పల్లి తదితర ప్రాంతాలకు మెరుగైన రవాణా అనుసంధానం ఏర్పడనుంది. ఫలితంగా పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లు, గిడ్డంగులు, నివాస సముదాయాల అభివృద్ధికి అవకాశాలు పెరగనున్నాయి.హైదరాబాద్ అభివృద్ధిని నగర శివారు ప్రాంతాలకు విస్తరించడంలో RRR కీలక మౌలిక సదుపాయంగా నిలిచే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, అనుసంధాన రహదారులు, పారిశ్రామిక పెట్టుబడుల ఆధారంగానే ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధి వేగం నిర్ణయించబడనుంది.

హైదరాబాద్ శివార్లలో భూముల వేలానికి HMDA భారీ కసరత్తు!
హైదరాబాద్ శివార్లలో భూముల వేలానికి HMDA భారీ కసరత్తు!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు కొత్త సవాల్!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు కొత్త సవాల్!
మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ అభివృద్ధికి కొత్త అధ్యాయం!?
మూసీ ప్రక్షాళనతో హైదరాబాద్ అభివృద్ధికి కొత్త అధ్యాయం!?

Economy

కార్తీక వనభోజనాలకు ఘనంగా ఏర్పాట్లు
కార్తీక వనభోజనాలకు ఘనంగా ఏర్పాట్లు

కవులు, రచయితలకు నక్క శ్రీనివాస్ యాదవ్ ఆహ్వానం

ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్

కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నక్క వెంకటమ్మ యాదవ్ – నక్క యాదగిరి స్వామి యాదవ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని వనస్థలిపురంలోని ఆటోనగర్ జింకల పార్క్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.ఈ కార్యక్రమానికి కవులు, రచయితలు, సాహితీవేత్తలు, అభిమానులు, ఆహ్వానితులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు నక్క శ్రీనివాస్ యాదవ్, పి. బడే సాబ్ విజ్ఞప్తి చేశారు. కార్తీక మాస పవిత్రతను చాటుతూ ఆధ్యాత్మికత, సాహిత్య సాంస్కృతిక వాతావరణంలో ఆత్మీయ సమ్మేళనంగా వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఖాళీ టెర్రస్‌ను విలాసవంతమైన స్మార్ట్ పెంట్‌హౌస్‌గా మార్చుకోండి
ఖాళీ టెర్రస్‌ను విలాసవంతమైన స్మార్ట్ పెంట్‌హౌస్‌గా మార్చుకోండి
ఖాళీ టెర్రస్‌ను విలాసవంతమైన స్మార్ట్ పెంట్‌హౌస్‌గా మార్చుకోండి!
ఖాళీ టెర్రస్‌ను విలాసవంతమైన స్మార్ట్ పెంట్‌హౌస్‌గా మార్చుకోండి!
కస్టమర్‌ను గెలిస్తేనే డీల్ గెలిచినట్లు!
కస్టమర్‌ను గెలిస్తేనే డీల్ గెలిచినట్లు!

Latest News

పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్ విండో అనుమతులు

48 గంటల్లో కీలక నిర్ణయం ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక కన్వెన్షన్ సెంటర్‌కు భూమి కేటాయిస్తాం పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో–2026 ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి హామీ ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్ తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించడంతో…

హైదరాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి భారీ ప్రణాళిక!

మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, పీఆర్‌టీఎస్‌కు వేగం.. 2027 జనవరిలో మూసీ ఫేజ్‌-1 పనులు ప్రారంభం మల్టీ లెవెల్ పార్కింగ్‌లు, ఆధునిక గోశాల, ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్‌కు ప్రాధాన్యం ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు క్యూర్,…

హైదరాబాద్ చుట్టూ RRR.. రియల్ ఎస్టేట్‌కు కొత్త రెక్కలు

ఉత్తర, దక్షిణ భాగాలుగా 362 కి.మీ. రింగ్ రోడ్.. 90 గ్రామాల్లో 4,962 ఎకరాల భూసేకరణకు కసరత్తు రైతులకు ప్రాంతాల వారీగా పరిహారం.. శివారు ప్రాంతాల్లో పారిశ్రామిక, నివాస అభివృద్ధికి భారీ అవకాశాలు ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్ హైదరాబాద్ మహానగర…

జింకల పార్కులో కార్తీక వనభోజనాల సందడి!

శివనామస్మరణతో మార్మోగిన వనస్థలిపురం.. కవులు, రచయితల సమక్షంలో వైభవంగా వేడుకలు ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక ఆనందం.. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా వనభోజనాలు ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని వనస్థలిపురంలోని జింకల పార్కులో కార్తీక మాస వనభోజన కార్యక్రమం…

ఇందిరమ్మ ఇళ్లకు TG RERA అనుమతులు

ప్రభుత్వ గృహ నిర్మాణ ప్రాజెక్టులకు తొలిసారి రెరా గుర్తింపు.. లబ్ధిదారుల హక్కులకు మరింత భరోసా మలక్‌పేట, కుత్బుల్లాపూర్ ప్రాజెక్టులకు తొలి విడతలో అనుమతులు ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో కీలక…