ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమం.. జ్యోతి ప్రజ్వలన చేసిన రాజ్ న్యూస్ తెలుగు ఛానల్ ఛైర్పర్సన్ లక్ష్మీ రావు
పెద్ద సంఖ్యలో హాజరైన ఛానల్ పార్ట్నర్స్.. ఏజెంట్లకు డిజిటల్ వేదికగా REBAX
ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్
రియల్ ఎస్టేట్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఏజెంట్లు, ఛానల్ పార్ట్నర్స్కు డిజిటల్ వేదికను అందించే లక్ష్యంతో రూపొందించిన ‘REBAX’ మొబైల్ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్ న్యూస్ తెలుగు ఛానల్ ఛైర్పర్సన్ శ్రీమతి లక్ష్మీ రావు గారు హాజరయ్యారు. ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా REBAX యాప్ రూపకర్తలను అభినందిస్తూ, రియల్ ఎస్టేట్ రంగంలో డిజిటల్ వేదికల ప్రాధాన్యతను వివరించారు.
ఫౌండర్, కో-ఫౌండర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమం/REBAX యాప్ ఫౌండర్ పృథ్వీరాజ్, కో-ఫౌండర్స్ వసంత్, అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేస్తున్న ఏజెంట్లు, ఛానల్ పార్ట్నర్స్ను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం, వారి వ్యాపార కార్యకలాపాలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ఈ యాప్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.

QR కోడ్‌తో సులభంగా రిజిస్ట్రేషన్
REBAX యాప్‌లో ఏజెంట్‌గా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక QR కోడ్‌ను అందుబాటులో ఉంచారు. QR కోడ్‌ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అనంతరం Google Play Store, Apple App Store ద్వారా మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు. ఈ యాప్‌కు సంబంధించిన వివరాలను కార్యక్రమంలో పాల్గొన్న వారికి పరిచయం చేశారు.
పెద్ద సంఖ్యలో ఛానల్ పార్ట్నర్స్ హాజరు
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ఛానల్ పార్ట్నర్స్ హాజరై తమ మద్దతు తెలిపారు. వారి ఉత్సాహభరితమైన భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఏజెంట్లు, ఛానల్ పార్ట్నర్స్కు డిజిటల్ పరిజ్ఞానం ద్వారా కొత్త అవకాశాలను పరిచయం చేసే దిశగా REBAX అడుగులు వేస్తోంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డిజిటల్ టెక్నాలజీ, నెట్వర్కింగ్, ఏజెంట్ వ్యవస్థలకు పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో REBAX యాప్ భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలను అందిస్తుందో పరిశ్రమ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


