ప్రాపర్టీ వాయిస్ : మోత్కూర్‌

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లోని ఆల్ ఇన్ వన్ షాపింగ్ మాల్‌లో గడువు ముగిసిన బిస్కెట్ల విక్రయం వెలుగులోకి వచ్చింది. అక్టోబర్ 24న కొనుగోలు సమయంలో వినియోగదారులు ఈ విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. సంబంధిత ప్యాకెట్‌పై గడువు తేదీ 20-09-2026గా ముద్రించి ఉందని పేర్కొన్నారు.

గతంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకున్నట్లు వినియోగదారుల సంఘం కార్యకర్తలు తెలిపారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని వినియోగదారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు పోచం సోమయ్య అన్నారు.

దుకాణాల్లో ఆహార పదార్థాల గడువు తేదీలను తనిఖీ చేసి, వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Shankar Pothuganti

By Shankar Pothuganti

Publisher & Editor