ఉప్పల్ బస్టాండ్ చౌరస్తాలో ఎంఎంఆర్ ఫుడ్ టిఫిన్ సెంటర్‌ను పరిశీలించిన వినియోగదారుల హక్కుల కార్యకర్తలు
ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్
ఆహార నాణ్యతకు, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ వినియోగదారులకు సేవలందిస్తున్న హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు అభినందనీయులని వినియోగదారుల హక్కుల కార్యకర్తలు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఉప్పల్ బస్టాండ్ చౌరస్తాలోని ఎంఎంఆర్ ఫుడ్ టిఫిన్ సెంటర్‌ను సందర్శించి, అక్కడ ఆహార పదార్థాల తయారీ విధానం, వంటగది పరిశుభ్రత, వినియోగిస్తున్న నూనె తదితర అంశాలను పరిశీలించారు.
శుక్రవారం ఉదయం నిర్వహించిన ఈ పరిశీలనలో టిఫిన్ సెంటర్లో వంట చేస్తున్న కుక్ సుబ్రత తలకు క్యాప్ ధరించి ఆహార పదార్థాలను తయారు చేయడాన్ని కార్యకర్తలు గుర్తించారు. వంట చేసే సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, ఆహార తయారీలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రశంసనీయమని అన్నారు. అలాగే వంట నూనె వినియోగం, చేతులు శుభ్రం చేసుకునే సదుపాయాలు, ప్లేట్ల పరిశుభ్రత వంటి అంశాలను పరిశీలించారు.టిఫిన్ వడ్డించే ప్లేట్లలో అల్యూమినియం ఫాయిల్‌ను ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన కార్యకర్తలు, ఆహార భద్రతకు అనుగుణంగా పాత్రలు, వంటగది, పరిసరాల పరిశుభ్రతను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
ఆహార వ్యాపారానికి వర్తించే నిబంధనల ప్రకారం అవసరమైన ఫుడ్ సేఫ్టీ రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్‌ను కలిగి ఉండాలని తెలిపారు. ఫుడ్ లైసెన్స్‌ను ఆన్లైన్లో రూ.100 చెల్లించి పొందినట్లు యజమాని వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించారు.లాభార్జనతోపాటు సేవాభావం ముఖ్యంఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ, హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు కేవలం లాభాలకే పరిమితం కాకుండా వినియోగదారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన ఆహారాన్ని అందించాలని సూచించారు.
వంట నూనె వినియోగం, ఆహార పదార్థాల నాణ్యత, సిబ్బంది వ్యక్తిగత శుభ్రత, వంటగది పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. బాధ్యతాయుతమైన నిర్వహణతో వినియోగదారుల విశ్వాసాన్ని పొందవచ్చని పేర్కొన్నారు.ఆహార భద్రతపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడటంతోపాటు వ్యాపార సంస్థలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ఎంఎంఆర్ ఫుడ్ టిఫిన్ సెంటర్ యజమాని పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ సేవలందించడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఇదే విధానాన్ని ఇతర హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులు కూడా అనుసరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్టీసీ కంట్రోలర్, వినియోగదారుల హక్కుల కార్యకర్త బుచ్చయ్య, హైదరాబాద్ కందిమల్లపురం ప్రెసిడెంట్ అడ్వకేట్ రామమోహన్ రావు, జనరల్ సెక్రటరీ బాస శ్రీనివాస్, గణేష్ గౌడ్, అడ్వకేట్ మేఘన యాదవ్, సిద్దిపేట రవి తదితరులు పాల్గొన్నారు.
