ఫ్యూచర్ సిటీకి చేరువలో అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ కారిడార్..
శ్రీశైలం హైవే సమీపంలో DTCP ఆమోదిత లేఅవుట్..
ఆధునిక మౌలిక సదుపాయాలతో నివాస, పెట్టుబడి అవకాశాలు!
ప్రాపర్టీ వాయిస్ : హైదరాబాద్
హైదరాబాద్ నగర విస్తరణతో పాటు దక్షిణ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ముఖ్యంగా శ్రీశైలం హైవే పరిసరాలు, కడ్తాల్, కందుకూరు, మహేశ్వరం ప్రాంతాలు భవిష్యత్తు పెట్టుబడులకు కీలక ప్రాంతాలుగా గుర్తింపు పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కంధ గ్రూప్ ఆధ్వర్యంలో రూపొందించిన ‘అలేఖ్య బృందావనం’ ప్రాజెక్టు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ఫ్యూచర్ సిటీకి చేరువలో వ్యూహాత్మక లొకేషన్
ప్రాజెక్టు ప్రత్యేకత ప్రధానంగా దాని భౌగోళిక స్థానం. శ్రీశైలం హైవే (NH-765)కు కేవలం రెండు నిమిషాల ప్రయాణ దూరంలో, మైసిగండి దేవాలయానికి ఒక నిమిషం దూరంలో ఉన్నట్లు బ్రోచర్లో పేర్కొన్నారు. కడ్తాల్ పట్టణం, మున్సిపాలిటీకి సమీపంలో ఉండటంతో పాటు ఫ్యూచర్ సిటీ, లైఫ్ సైన్సెస్ డెవలప్మెంట్ జోన్‌కు చేరువలో ఉండటం ప్రాజెక్టుకు ప్రాధాన్యతను తీసుకొస్తోంది.
కందుకూరు–మహేశ్వరం పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానం, మహేశ్వర మహా పిరమిడ్ సమీపం కూడా ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఫార్మా కంపెనీలకు సమీపం.. ఉపాధి అవకాశాలకు అనుసంధానం
డా. రెడ్డీస్, అరబిందో ఫార్మా, హెటిరో, లారస్ ల్యాబ్స్, MSN, గ్లాండ్ ఫార్మా, గ్రాన్యూల్స్, బయోలాజికల్ ఈ వంటి ప్రముఖ ఫార్మా, లైఫ్ సైన్సెస్ సంస్థలు ఈ ప్రాంత పరిసరాల్లో ఉన్నాయి.
పారిశ్రామిక, ఫార్మా రంగాల విస్తరణతో ఈ ప్రాంతంలో భవిష్యత్తులో నివాస అవసరాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి.

DTCP అనుమతితో లేఅవుట్ అభివృద్ధిఅలేఖ్య బృందావనం ప్రాజెక్టును DTCP ఆమోదిత లేఅవుట్‌గా . TLP No. 87/2024/H వివరాలు, RERA రిజిస్ట్రేషన్ నంబర్ P02400009081.
ప్రాజెక్టులో 40 అడుగులు, 33 అడుగుల బీటీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, 24 గంటల సెక్యూరిటీ, ప్రత్యేక వీధి దీపాలు, ల్యాండ్‌స్కేప్ పార్కులు, జాగింగ్ ట్రాక్, పిల్లల ఆటస్థలం, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్, గ్రీన్ వాక్‌వేస్, అవెన్యూ ప్లాంటేషన్ వంటి సదుపాయాలను ప్రతిపాదించారు.
అంతేకాకుండా ప్రవేశ ద్వారం వద్ద ఫెన్సింగ్, రెండేళ్లపాటు సెక్యూరిటీ, నిర్వహణ సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు.
కుటుంబ నివాసానికి.. భవిష్యత్తు పెట్టుబడికి అనువైన ప్రణాళిక
కుటుంబంతో ప్రశాంతమైన వాతావరణంలో నివసించాలనుకునే వారికి, అలాగే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ ప్రాజెక్టు ఒక పరిశీలించదగిన అవకాశం. పార్కులు, పిల్లల ఆటస్థలం, జాగింగ్ ట్రాక్, గ్రీన్ వాక్‌వేస్ వంటి సదుపాయాలు నివాస అనుభూతిని మెరుగుపరిచేలా రూపొందించారు.
దక్షిణ హైదరాబాద్ అభివృద్ధిలో కొత్త అవకాశాలు
హైదరాబాద్ నగరం దక్షిణ దిశగా విస్తరిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం హైవే, కడ్తాల్, మహేశ్వరం, కందుకూరు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా రహదారి అనుసంధానం, పారిశ్రామిక అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల ప్రణాళికలు ఈ ప్రాంతాలపై పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
స్కంధ గ్రూప్ అలేఖ్య బృందావనం ప్రాజెక్టు లో ప్లాట్లు కొనేముందు కొనుగోలుదారులు పెట్టుబడి పెట్టే ముందు లేఅవుట్ అనుమతులు, RERA వివరాలు, భూమి యాజమాన్య పత్రాలు, రిజిస్ట్రేషన్ అర్హత, సంబంధిత ప్రభుత్వ రికార్డులను స్వయంగా ధృవీకరించుకోవడం అవసరం.
